Site icon Swatantra Tv

చంద్రబాబు అరెస్ట్ పై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమ్మన్నాడంటే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని అన్నారు. దాంతో బీఆర్ఎస్ కు సంబంధం లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు స్పందించారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెలంగాణలో కూడా పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న హైదరాబాద్ విప్రో సర్కిల్ లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

Exit mobile version