Site icon Swatantra Tv

కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్‌ రావు ఫైర్

వికాసం కావాలంటే వినోద్ గెలువాలని, విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలని అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమని, సెంటి మెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బీజేపీ పెద్ద కార్పొరేట్ సంస్థలకు రూ.14 లక్షల కోట్లు మాఫీ చేసిందని, పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ సభ తుస్సుమందని ఎద్దేవా చేశారు.

Exit mobile version