Site icon Swatantra Tv

కేంద్ర బ‌డ్జెట్‌ను చూస్తే బాధ క‌లుగుతుంది- హరీశ్‌రావు

కేంద్రం ప్రవేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ను చూస్తే బాధ క‌లుగుతుంద‌ని అన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ ప‌ద‌మే ఉచ్ఛరించ‌లేదు.. ఆంధ్రప్రదేశ్ పేరును అనేక‌సార్లు ఉచ్ఛరించారు అని ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ క‌లిసి తెలంగాణ‌కు అన్యాయం చేశార‌ని హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ‌లో కూడా వెనుక‌బ‌డిన జిల్లాలు ఉన్నాయి. విభ‌జ‌న చట్టం ప్రకారం తెలంగాణ‌లో 9 జిల్లాలు వెనుక‌బ‌డి ఉన్నాయన్న హరీశ్ రావు.. కేంద్ర మంత్రులుగా ఉన్న కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ ఎందుకు చొరవ చూప‌డం లేదని ప్రశ్నించారు. తెలంగాణ‌కు బీజేపీ ప్రభుత్వం తీర‌ని అన్యాయం చేసిందని విమర్శించారు.

Exit mobile version