Site icon Swatantra Tv

పెళ్లి కళ : వైభవంగా గుణశేఖర్ కుమార్తె కల్యాణం

సామాజిక స్ప్రహతో సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరైన తెలుగు సినిమా ద‌ర్శ‌కుడు గుణశేఖ‌ర్‌ అంటే ఎవరూ తెలియని వారంటూ ఉండరు. ఇప్పుడు ఆయన ఇంటికి పెళ్లి కళ వచ్చింది.

ఆయ‌న ప్ర‌థ‌మ కుమార్తె, శాకుంత‌లం సినిమా నిర్మాత కూడా అయిన నీలిమ గుణ వివాహం డిసెంబ‌ర్‌ 2 రాత్రి 12 గంట‌ల 31 నిమిషాల‌కు అనగా (తెల్ల‌వారితే శ‌నివారం) అంగరంగ వైభవంగా జరిగింది.

ప్ర‌ముఖ విద్యావేత్త‌, వ్యాపార‌వేత్త‌, ఎంట‌ర్ ప్రెన్యూర‌ర్, శ్రీ శ‌క్తి గ్రూప్ అధినేత‌లు, హైద‌రాబాద్ వాస్త‌వ్యులైన డా.రామ‌కృష్ణ పింజ‌ల‌, శ్రీమ‌తి స‌త్య పింజ‌ల గారి కుమారుడు ర‌వి ప్ర‌ఖ్యాతో ఘనంగా వివాహం జ‌రిగింది.  

మంగ‌ళ వాయిద్యాల‌తో, వేద మంత్రాల సాక్షిగా బంధు మిత్రులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్ నామా ప్యాలెస్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఇంకా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పెళ్లికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Exit mobile version