Site icon Swatantra Tv

పవన్ కళ్యాణ్‌కు గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

       జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని… ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలన్నారు. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో తన పేరున ఉన్న 9 ఎకరాలలో స్థలం ఇచ్చేవాడినని అన్నారు. పక్కనుండే కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని ఆరోపించారు. చిరంజీవి సౌమ్యుడని.. ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకు న్నారని కొనియాడారు. తాను రౌడి ఎమ్మెల్యే అయితే.. ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా అని ప్రశ్నించారు గ్రంథి శ్రీనివాస్‌.

Exit mobile version