ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి దర్శనం అన్నపానాదులకు లోటు రానివ్వదని ప్రతీతి చెందింది. ఉదయం 5గంటల నుంచే క్యూలైన్లలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు తాగునీరు, పాలు ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు అధికారులు.