స్వతంత్ర వెబ్ డెస్క్: రాజ్‌భవన్‌లో(Raj Bhavan) గవర్నర్(Governor) నిర్వహించే ఎట్ హోం(At Home) తేనేటి విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి దూరంగా ఉన్నారు. రాజ్‌భవన్ ఎట్ హోంకు వరుసగా సీఎం కేసీఆర్ మూడోసారి గైర్హాజరయ్యారు. చివరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
సీఎం గైర్హాజర్‌పై గవర్నర్ తమిళ సై(Governor Tamil Sai) స్పందిస్తు తాను తేనేటి విందుకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, అయితే సీఎం రావడం, రాకపోవడం రాజ్ భవన్ పరిధిలో లేదన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వైఖరి తనను తీవ్రంగా బాధించిందని, గవర్నర్ల పై సీఎంల తీరు ఇలా ఉండటం ఎప్పటికి మంచిదికాదన్నారు.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనూ ఆర్టీసీ విలీన బిల్లు వివాదంపై గవర్నర్‌ను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదిక కూడా గవర్నర్‌పై సెటైర్లు వేశారు. రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య సాగుతున్న వైరం నేపధ్యంలో గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లుల పరిస్థితి ఏమిటన్నదానిపై ఉత్కంఠ కొనసాగనుంది.గవర్నర్ దగ్గర మొత్తం 12బిల్లులు, ఇద్దరి ఎమ్మెల్సీల ప్రతిపాదనలు సైతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్‌కు, సీఎం కేసీఆర్‌కు సాగుతున్న ప్రచ్చన్న యుద్దంలో ఆ బిల్లులకు ఎప్పటిలోగా ఆమోదం లభిస్తుందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.