Site icon Swatantra Tv

Governor Tamilisai |గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌.. ముదురుతున్న వివాదం.. వేడి పుట్టిస్తున్న తమిళిసై ట్వీట్‌..

Telangana

Governor Tamilisai |తెలంగాణలో గవర్నర్‌ వర్సెస్‌ గవర్నర్‌ మధ్య వివాదం మరింత ముదరుతోంది. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వార్‌ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమెదించి పంపిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా ప్రభుత్వ తీరును ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై చేసిన ట్వీట్‌ మరింత వేడి పుట్టిస్తోంది. ప్రభుత్వం, సీఎం తీరుపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ విమర్శలు గుప్పించారు. బిల్లులు ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీకోర్టుకు వెళ్లడంపై.. పరోక్షంగా విమర్శలు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉందంటూ గవర్నర్ తమిళిసై గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్‌ శాంతికుమారిపై కూడా గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్‌భవన్‌కు రావడానికి టైమ్‌ లేదా అంటూ గవర్నర్‌ సీఎస్(Santhi Kumari) ను విమర్శించారు. ప్రొటోకాల్‌ పాటించరా.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉందన్న విషయం గుర్తించుకోవాలని.. మరోసారి గుర్తుచేస్తున్నానంటూ పేర్కొన్నారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మీకు.. అధికారికంగా రాజ్‌భవన్‌ని సందర్శించడానికి టైం దొరకలేదు.. మర్యాదపూర్వకంగా పిలిచినా మర్యాద లేదు అంటూ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) అసహనం వ్యక్తంచేశారు. స్నేహపూర్వక చర్చల ద్వారానే బిల్లులు ఆమోదం పొందుతాయని గవర్నర్ పేర్కొన్నారు.

Telangana: తమిళిసై తాజా ట్వీట్‌తో గవర్నమెంట్ వర్సెస్‌ గవర్నర్‌ మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం తీరును తమిళసై తప్పుపడుతుంటే.. బీజేపీ ఏజెంట్‌గా తమిళసై వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. ప్రభుత్వం పంపిన బిల్లులు గవర్నర్‌ పరిశీలనలో ఉన్నాయని రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ మధ్య వార్‌ భవిష్యత్తులో మరిన్ని వివాదాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

 Read Also: గవర్నర్ తమిళిసైపై సుప్రీంను ఆశ్రయించిన టీసర్కార్

Follow us on:   Youtube   Instagram

Exit mobile version