Site icon Swatantra Tv

చీరకట్టులో అదరహో అంటున్న నిధి అగర్వాల్

బ్యూటిఫుల్ మేకోవర్ తో ఎప్పటికప్పుడు తన అభిమానులను, మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె వెస్ట్రన్, ట్రెడిషనల్..ఏ దుస్తుల్లో అయినా చూపు తిప్పుకోనివ్వకుండా ముస్తాభవుతుంటుంది. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో చీరకట్టులో మెరిసింది నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ ట్రెడిషనల్ మేకోవర్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో నిధి చాలా బాగుందంటూ నెటిజన్స్ కామెంట్స్ రాస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది నిధి అగర్వాల్. ఆమె రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన “రాజా సాబ్”, పవర్ స్టార్ తో “హరి హర వీరమల్లు” మూవీస్ చేస్తోంది. ఈ రెండు బిగ్ టికెట్ రిలీజ్ లతో వచ్చే ఏడాది ప్రేక్షకుల్ని అలరించబోతోంది నిధి అగర్వాల్.

Exit mobile version