Site icon Swatantra Tv

Tirumala | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

తిరుమల(Tirumala) శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నామని తిరుమల తిరుపతి దేస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన.. సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. వేసవిలో బ్రేక్‌ సిఫారసు లేఖలను తగ్గిస్తామన్నారు. ముఖ గుర్తింపుతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేయనున్నట్టు తెలిపారు. వేసవి కాలంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. కరోనాకు ముందు నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లను తిరుమల((Tirumala)) తిరుపతి దేవస్థానం జారీ చేసేది అయితే కరోనా సమయంలో వీటిని నిలిపివేసింది. తాజాగా మళ్లీ నడిచి వచ్చే భక్తుల కోసం దివ్యదర్శన టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

Read Also: G20 సదస్సుకు అదిరిపోయే ఏర్పాట్లు.. నేడు విశాఖకు సీఎం జగన్..
Follow us on:   YoutubeInstagram
Exit mobile version