Site icon Swatantra Tv

Gold Price Today |పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవే..

Gold Price Today |మన దగ్గర కొంచెం డబ్బుంటే చాలు వెంటనే మన మనసులో మెదిలే ఆలోచన వాటిని దేనిపై పెట్టుబడి పెడదామా అని.. మన దగ్గర ఉన్న నగదు ఆధారంగా మన ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులైతే స్థిర, చర ఆస్తులపై.. అదే కొంచెం తక్కువ మొత్తంలో అయితే ఎక్కువ మంది ఆలోచించేది బంగారం కొందామని, మరికొంతమంది అయితే షేర్లు లేదా సేవింగ్‌ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి బంగారం కొనాలంటే ముందు వాటి ధరలు తెలుసుకోవాలి. చాలా మంది ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి. రానున్న వారం రోజుల్లో తగ్గే అవకాశాలున్నాయా.. పెరిగే అవకాశాలున్నాయా.. పోయిన వారం రోజులు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయనేది చూస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ధర ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఈరోజు (మార్చి4) ప్రధాన నగరాల్లో బంగారం ధరలు మీ కోసం..

శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు కొన్ని చోట్ల పెరిగితే మరికొన్ని చోట్ల తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారంపై సుమారు 100 రూపాయల వరకు పెరిగ్గా.. దేశ రాజధాని ఢిల్లీ సహా కొన్ని నగరాల్లో 22 క్యారెట్ల బంగారంపై రూ.50 వరకు పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.50వరకు తగ్గింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 గా ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Gold Price Today |తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550గా ఉంది.

విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 గా ఉంది.

ప్రధాన నగరాల్లో..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,950ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,280గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600గా ఉంది.

వెండి ధర

వెండి ధర ముంబై మార్కెట్‌లో కిలో రూ.66,900గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో అయితే కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.

Read Also:  ఆ ఇద్దరి బాధ్యత నాదే.. ఆ విషయంలో మంచు మనోజ్ క్లారిటీ..

Follow us on:   Youtube   Instagram

Exit mobile version