Gold Price |బంగారం అంటే ఇష్టపడని వారెవరుంటారు. తమ దగ్గర ఏ మాత్రం డబ్బులున్నా.. వాటిని బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి మధ్య తరగతి ప్రజలు ఎక్కువుగా మక్కువు చూపిస్తుంటారు. అయితే బంగారం ధరలు ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో.. ధర తగ్గితే పసిడి కొందామని ఎదురుచూస్తుంటారు. ఈక్రమంలో దేశంలో ప్రధాన నగరాలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850 లుగా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 59,840 గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు(Gold Price): దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,990గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,850కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,990, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,890, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,840 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,850,
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,840 లుగా కొనసాగుతోంది.