Site icon Swatantra Tv

గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్టు చేయాలి- రాహుల్ గాంధీ

లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్ట్‌ చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తానని. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని రాహుల్‌ గాంధీ అన్నారు. మోదీ, అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు.

Exit mobile version