Site icon Swatantra Tv

జీ 20 సమ్మిట్ .. ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ స్వాగతం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జీ20 సదస్సు జరుగుతున్న భారత్‌ మండపం వద్ద ప్రధాని మోదీ.. ప్రపంచ నేతలకు స్వాగతం పలికారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్  మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ క్రిస్టాలినా జార్జివా, ప్రపంచ వాణిజ్య సంస్థ  డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో-ఇవాలాను ఘనంగా స్వాగతించారు. ఈ క్రమంలో ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన వేదిక వద్దకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా కూడా వచ్చారు. 13వ శతాబ్దపు కళాఖండం, కాలం, పురోగతి, నిరంతర మార్పుకు ప్రతీకగా నిలిచిన కోణార్క్ చక్రం ప్రతిరూపం క్రమంలో ప్రపంచ నాయకులకు మోదీ స్వాగతం పలికారు.

Exit mobile version