స్వతంత్ర వెబ్ డెస్క్: శ్రీవారి భక్తులకు ఎయిర్ పోర్టు తరహాలో, వారి లగేజీని తిరుపతి నుండి తిరుమలకు తరలించి ఉచితంగా అందజేస్తామని టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. గతంలో లగేజి తరలించడం, తిరిగి అప్పగించడం మ్యానువల్ పద్దతిలో నిర్వహించామని చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, ట్రాక్ ఐడీ విధానంతో సాఫ్ట్ వేర్ రూపొందించామని తెలిపారు. లగేజీ ఎక్కడ ఉందో భక్తులు , సెల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
తిరుమల అన్నమయ్య భవన్లో లగేజీ నూతన ట్రాన్స్పోర్ట్ సిస్టంను, డెమోగా ప్రదర్శించి వివరించారు. దాతల సహకారంతో ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామని, లగేజీ కౌంటర్లలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తామన్నారు. ఇప్పటికే సిబ్బందికి నూతన విధానంపై శిక్షణ ఇచ్చామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.