Site icon Swatantra Tv

Foxconn |తెలంగాణలో త్వరలో భారీ పెట్టుబడులు.. కేసీఆర్‌కు ఆ సంస్థ ఛైర్మన్‌ లేఖ

Foxconn

Foxconn |ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఫాక్స్‌కాన్‌ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈమేరకు ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌లియూ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ముందుగా హైదరాబాద్‌లో అతిథ్యానికి యంగ్‌లియూ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో వీలైనంత తొందరలోనే ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుచేస్తామని లేఖలో పేర్కొన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పార్క్‌ పెడుతున్నామని, ఈపార్కు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వ సహకరాం కావాలంటూ కోరారు. అలాగే సీఏం కేసీఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానించారు యంగ్‌లియూ.

 Read Also: చెరుకు సుధాకర్ పై బెదిరింపులు.. క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి

Follow us on:   Youtube   Instagram

 

Exit mobile version