Site icon Swatantra Tv

డ్యామేజీపై రిపోర్ట్ కు నాలుగు నెలల గడువు

     కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల డ్యామేజీ, పటిష్టతపై అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆరుగురితో కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధక్ష్యతన ఏర్పడిన ఈ కమిటీలో మరో ఐదుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు. నాలుగు నెలల్లో ఈ మూడు బ్యారేజీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అథారిటీ పాలసీ-రీసెర్చ్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2న రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్టు మెంటు సెక్రటరీ ఫిబ్రవరి 13న రాసిన లేఖకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

   మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నా యాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజే యాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది.

Exit mobile version