Site icon Swatantra Tv

రుషికొండ వివాదంపై మాజీ మంత్రి రోజా ట్వీట్

   విశాఖలో రుషికిండ కట్టడాల వివాదంపై మాజీ మంత్రి రోజా ఎక్స్‌ వేదికగా స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించ డం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మిం చడం తప్పా? అని నిలదీశారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా? అంటూ ప్రశ్నిం చారు.

Exit mobile version