Site icon Swatantra Tv

కాంగ్రెస్‌ సర్కార్‌ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

     కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటలు తగులబెట్టుకుం టుంటే బాధ కలుగుతుందన్నారు. కష్టపడి సాగుచేసిన రైతు తన పొలాన్ని తగులబెట్టుకునే దుస్థితి దాపురించింద న్నారు. కాంగ్రెస్‌ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌ మంత్రులు, నేతలకు లేదని విమర్శించా రు. రైతులకు వ్యతిరేకంగా మంత్రి తుమ్మల మాట్లాడారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు చేసినవన్నీ తుమ్మలకు తెలుసని అన్నారు నిరంజన్ రెడ్డి. చేతనైతే రైతు భరోసా రూ.15 వేలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. తాము చేసినదానికంటే రైతులకు ఎక్కువ మేలు చేయాలని సూచిం చారు. కేసీఆర్‌, కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లే దుర్భుద్దే కనిపించిందని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాలన్న సోయి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదన్నారు. అత్యధిక వరద వల్లనే మేడిగడ్డ బరాజ్‌లో రెండుమూడు పిల్లర్లకు నష్టం కలిగిందని చెప్పారు. ఇప్పుడు ఎత్తిపోస్తున్న నీళ్లే రెండు నెలల కింద ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Exit mobile version