Site icon Swatantra Tv

పార్టీ బలోపేతంపై ఫోకస్‌ చేసిన మాజీ సీఎం జగన్

పార్టీ బలోపేతంపై ఫోకస్‌ చేసిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి .. వరుసగా జిల్లాల నేలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా నేడు ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే నెల మూడోవారం నుంచి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే జిల్లా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు.

ఈ సమావేశానికి అనంతపురం జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారు జగన్‌. ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.

Exit mobile version