Site icon Swatantra Tv

స్పీకర్‌ను సన్మానించిన ఎఫ్ఎన్‌సీసీ సభ్యులు

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు ఎఫ్ఎన్‌సీసీకి ఆహ్వానించి సన్మానించారు. ప్రెసిడెంట్ ఆదిశేష గిరి, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు స్పీకర్‌ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సెక్రటరీ మోహన్ మాట్లాడుతూ.. ‘‘గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ప్రత్యేకంగా నా తరఫున, మా కమిటీ సభ్యులు తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’’ అని అన్నారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ‘‘నన్ను ఇలా ఈ సన్మానానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. FNCC చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడికి రావడం నా స్నేహితుల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా FNCC ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. FNCCకి నా వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని తెలియచేశా. ఇలా నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు FNCC కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు.

Exit mobile version