Site icon Swatantra Tv

ఎఫ్ఎన్‌సీసీ 12వ ఆలిండియా ఓపెన్ బ్రిడ్జి టోర్నమెంట్ విజేతలకు బహుమతులు

ఎఫ్ఎన్‌సీసీ 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారికి ఎఫ్ ఎన్ సి సి ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ, డైరెక్టర్ బి. గోపాల్ చేతుల మీదగా బహుమతులు అందించే కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఎఫ్ఎన్‌సీసీ పన్నెండవ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఈ నెల 9న ప్రారంభమై 11న ముగిసినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్ఎన్‌సీసీ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ, డైరెక్టర్ బి. గోపాల్ పాల్గొన్నారు. అలానే ఎఫ్ఎన్‌సీసీ సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ పెద్ది రాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జె బాలరాజు, శైలజా జుజల, ఏడిద రాజా, సామా ఇంద్రపాల్ రెడ్డి పాల్గొన్నారు. టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన నెస్ట్ ఇన్ టీం చెన్నై గ్రూప్, నవయుగ ట్రోఫీ మరియు క్యాష్ ప్రైస్ ని గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ కి మెయిన్స్ స్పాన్సర్ గా నవయుగ ఇంజనీరింగ్ వారు వ్యవహరించారు.

Exit mobile version