Site icon Swatantra Tv

నేవీలో శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరుల తొలి బ్యాచ్.. మహిళలు ఎంతమందంటే..

Agniveer First Batch |త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా తొలి బ్యాచ్‌ నౌకాదళ అగ్నివీర్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిలికాలో ఘనంగా నిర్వహించారు. మొత్తం 2 వేల 585 మంది నౌకాదళ అగ్నివీర్‌లు నాలుగు నెలల కఠోర శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లోకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి నావికాదళం చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ హాజరయ్యారు. రాజ్యసభ ఎంపీ పీటీ ఉష, ప్రముఖ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్మిరల్‌ హరి కుమార్‌ మాట్లాడుతూ.. నేర్చుకోవాలనే సంకల్పం, నిబద్ధత, జ్ఞాన సముపార్జన కోసం బలమైన పునాదులు వేసుకోవాలని అగ్నివీర్‌లకు సూచించారు. జాతి నిర్మాణ సాధనలో భాగంగా నేవీ ప్రధాన విలువలైన విధి, గౌరవం, ధైర్యసాహసాలను ప్రదర్శించాలన్నారు.తొలి బ్యాచ్‌లో(Agniveer First Batch) 272 మహిళా అగ్నివీర్‌లు సైతం తమ శిక్షణను పూర్తిచేసుకున్నారు. ఆర్మీలో నియామకాల కోసం కేంద్రప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చి.. అగ్నివీరులను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ఆ కేంద్రమంత్రితో ప్రత్యేక సమావేశం..

Follow us on:  YoutubeInstagramGoogle News

Exit mobile version