Site icon Swatantra Tv

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. 2 లక్షల 91 వేల 159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు పెట్టారు. దీనిలో మూలధన వ్యయం 33 వేల 487 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పన్ను ఆదాయం లక్షా 38 వేల 181 కోట్లు, పన్నేతర ఆదాయం 35 వలే 208 కోట్లుగా ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.72 వేల 659 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి ఇచ్చే మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలో మాఫీ చేస్తామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు. ఈ ఏడాది 57 వేల 112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు

Exit mobile version