Site icon Swatantra Tv

Tiger Nageswara Rao |వైజాగ్‌లో ఆ మూవీ కోసం భారీ సెట్‌.. అతగాడికి కెరీర్‌లో మొదటి పాన్‌ ఇండియా మూవీ..

Tigar-Nageswararao

Tiger Nageswara Rao |రవితేజ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవి తేజ అంటే ముందుగా గుర్తొచ్చే మూవీ ఇడియట్.. అతడి కెరీర్‌ను ఆ సినిమా ఓ మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. తరువాత కొన్ని ఫ్లాఫ్‌లు ఎదుర్కొన్నా ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ వరుసగా రెండు హిట్స్ అందుకున్నారు. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో చేసిన ధమాకా సినిమా హిట్ కొట్టింది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించిన రవితేజ తన నటనతో ఫ్యాన్స్‌ను మెప్పించాడు. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు. రవితేజ నటించిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక త్వరలో రవితేజ మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. వాటిలో ఒకటి టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు`. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలకు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా దీనిని చెప్పుకుంటున్నారు.

ఈ మూవీలో ఎన్నో ట్విస్ట్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. దీపావళి లేదా క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. వైజాగ్ లో వేసిన భారీ సెట్టింగ్ లో ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ జరపనున్నారట. ఈ మేరకు వీడియో కూడా రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

Read Also:  తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఏఆర్ రెహ్మాన్ కుమారుడు

Follow us on:   Youtube   Instagram

Exit mobile version