Site icon Swatantra Tv

రైతు సమస్యలే ఎజెండాగా బీఆర్ఎస్ పోరుబాట

    రైతు సమస్యల ఎజెండాగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్‌ హామీల అమలుపై బీఆర్ఎస్‌ ఆందోళనలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్‌. పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు బీఆర్ఎస్‌ నేతలు హైదరాబాద్‌లో సీఎస్ శాతికుమారికి వినతిపత్రం ఇవ్వనున్నారు. ఈనెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే ఎండిన పంట పొలాలను సంద ర్శిస్తున్నారు కేసీఆర్‌. బోనస్‌ ఇవ్వడంలో జాప్యం జరిగితే ఆందోళనలు ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్‌ పార్టీ నేతలు యోచిస్తున్నారు.

 

Exit mobile version