Site icon Swatantra Tv

“ఫ్యామిలీ స్టార్” నుంచి థర్డ్ సింగిల్ రేపు విడుదల

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘మధురము కదా..’ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ‘మధురము కదా..’ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఆర్కిటెక్ట్ గా విజయ్ దేవరకొండ తను వర్క్ చేస్తున్న బిల్డింగ్ దగ్గర మృణాల్ ఠాకూర్ తో కలిసి కూర్చుని మాట్లాడుతున్న స్టిల్ తో ఈ పోస్టర్ డిజైన్ చేశారు.

‘మధురము కదా..’ లిరికల్ సాంగ్ విజయ్, మృణాల్ లవ్ సాంగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా..శ్రేయా ఘోషల్ పాడారు. విడుదల చేస్తున్న ఒక్కో పాటతో “ఫ్యామిలీ స్టార్” సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా మారుతోంది. ఫస్ట్ సింగిల్ ‘నందనందనా.’, సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడీ థర్డ్ సాంగ్ పై మ్యూజిక్ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. “ఫ్యామిలీ స్టార్” సినిమా ట్రైలర్ ను ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

 

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్

సంగీతం : గోపీసుందర్

ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ

నిర్మాతలు : రాజు – శిరీష్

రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల

Exit mobile version