Site icon Swatantra Tv

ఇవాళ చంద్రబాబుకు కంటి ఆపరేషన్

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. బ్లడ్, యూరిన్, ఈసీజీ, 2డి ఎకో, కాలేయం – మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్, గుండె సంబంధిత టెస్టులు చేసినట్లు సమాచారం. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ నిపుణుల సూచనల మేరకు అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లో కంటికి ఆపరేషన్ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి 50రోజులకు పైగా రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆయనకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. ఏపీలోని ఉండవల్లి నుంచి భాగ్యనగరానికి వచ్చిన బాబుకు.. అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పట్టారు.

Exit mobile version