Site icon Swatantra Tv

గొర్రెల పంపిణీ స్కాంపై విచారణ వేగవంతం

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్‌పై విచారణ వేగంగా జరుగుతోంది. గొర్రెల స్కాములో నిందితులను రెండో రోజు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. పశుసంవర్ధక మాజీ ఎండీ రామ్ చందర్, ఓఎస్డీ కళ్యాణ్‌ని మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో ప్రశ్నిస్తున్నారు. నిన్న మొదటి రోజు విచారణ చేసిన అధికారులు ఇవాళ రెండో రోజు ప్రశ్నించనున్నారు. మొదటిరోజు కస్టడీ విచారణలో రామచందర్ నోరు విప్పలేదని అధికారులు చెబుతున్నారు. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ఎవరి ప్రమేయంతో దళారి. భోగస్ కంపెనీతో గొర్రెలను కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాలని ఆదేశించారు? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి అధికారులు ప్రశ్నలు వేస్తున్నారు. రెండో రోజు కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఫైల్స్ తరలింపు, కాల్చివేతపై ఏసీబీ ఆరా తీయనుంది.

Exit mobile version