Site icon Swatantra Tv

ఎక్స్‌క్లూజివ్: ‘ఆదిత్య 999 మ్యాక్స్’ను కన్ఫర్మ్ చేసిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ను కన్ఫర్మ్ చేశారు. తను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లోని ఆరో ఎపిసోడ్‌లో ‘ఆదిత్య 999 మ్యాక్స్’గురించి బాలకృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

1991లో వచ్చిన ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న బాలకృష్ణ.. అందుకోసం అన్ని పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. తన కుమారుడు మోక్షజ్జ తేజ లీడ్ రోల్‌లో నటిస్తాడని తెలిపారు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీల కలిసి పాల్గొన్న ఆరో ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఈ వివరాలు ప్రకటించారు. అంతేకాకుండా ‘ఆదిత్య 369’లోని గెటప్‌తో ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ కనిపించి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 6న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version