గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని చెప్పుకొచ్చారు. కుప్పం మున్సిపాలిటీకి 250 కోట్ల రూపాయాలను సీఎం చంద్రబాబు మంజూరు చేశారన్నారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టోను తప్పకుండా త్వరగా అమలు చేస్తారని భువనేశ్వరి స్పష్టంచేశారు.