Site icon Swatantra Tv

అప్పుడు ఓటమి పాలైనా ఇప్పుడు పోటీకి సిద్ధం

     అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఎస్పీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగనున్నారు. గతంలో సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారు..? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూ సినా..ఇప్పుడు విజయం సాధిస్తానని అంటున్న ప్రవీణ్ కుమార్  ధీమా ఏ మేరకు సఫలీకృతం కాగలదు.

     తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ క్యాడర్ కు చేదు అనుభవమే మిగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీచేసిన సిర్పూర్ లో ఏనుగు గుర్తుకు ఎదురు ఉండదని, నీలం జెండా ఎగరడం ఖాయం అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. అయితే, సిర్పూర్ నియోజక వర్గంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఓటమి పాలవ్వడమే కాకుండా మూడోస్థానానికి పరిమితం అయ్యారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే.. ప్రవీణ్ కుమార్ సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి ప్రకటించగా, ఆయన స్థానంలోనే ఆయన గెలవకపోగా రెండోస్థానం సైతం పొందలేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ అప్పుడు ఢీలా పడింది. పార్టి అధినేత్రి మాయావతి ఈ పరాజయం పై అసహనం వ్యక్తం చేసినట్టు నాడు వార్తలు వెలువడ్డాయి.

   అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడంలో బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. మరో సారి ఆ తరహా పొరపాట్లు జరగకుండా ఉండేం దుకు దిద్దుబాటు చర్యలు చేబట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నియమించిన బీఎస్పీ అధికార ప్రతినిధులను, నియోజకవర్గ ఇంచార్జ్ లపై వేటు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 17 పార్లమెంట్‍ నియోజకవర్గలను నాలుగు జోన్లుగా విభజించి… ప్రతి జోన్‍ కు ఒక్కొ కన్వీనర్‍ ను నియమిం చింది. ఒక్కో జోన్ పరిధిలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జోన్ల విభజన చేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్నయినా గెలిచి తీరాలనే పట్టుదలతో బీఎస్పీ అధిష్ఠానం ముందుకు వెళుతోందని తెలిసింది. ఇందులో భాగంగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నియోజక వర్గాల్లో పోటీ చేయడం, ప్రయోగాలు చేయడం కాకుండా, ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయించాలని ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ నియోజ కవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు సాగిస్తూ, ప్రచారం మొదలు పెట్టేశారు.ప్రవీణ్ కుమార్ సిర్పూర్ లో ఓడిపోవడంతో ఇక్కడికి వస్తున్నారనే విమర్శలు ఒకవైపు వస్తుండగా, ఎన్నికల ముందే నియోజకవర్గాలు ఎంచుకోవడం మైనస్ కావచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి నాగర్ కర్నూల్ ప్రజలు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి మరి.రాష్ట్రంలో హేమాహేమీ పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పేరొం దాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన సాగిస్తోంది. బీజేపీ తన ప్రాభవాన్ని చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ ఏ రీతిన ఈ పార్టీలతో పోరు సల్పకలదు, ఎంత మేరకు సఫలీకృతం కాగలదు, ఎన్ని సీట్లు దక్కించుకోగలదు…అనే ప్రశ్నలకు భవితే సమాధానం చెప్పాలి.

Exit mobile version