Site icon Swatantra Tv

డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు

స్వతంత్ర, వెబ్ డెస్క్: డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రెండు బ్యూరోలను ప్రారంభించనుంది. ఒకవైపు డ్రగ్స్ కంట్రోల్ కోసం నార్కోటిక్ బ్యూరో పని చేయనుంది. ఈ బ్యూరోని సమర్థవంతంగా నిర్వహించడానికి నార్కోటిక్ బ్యూరో చీఫ్‌గా సీవీ ఆనంద్ ని నియమించింది. మరోవైపు, పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసింది. ఈ వింగ్ సైబర్ సెక్యూరిటీ వింగ్‌ గా ఉండి.. సైబర్ ఎటాక్ లను అరికట్టేందుకు దోహదపడుతుంది. ఈ బ్యూరో చీఫ్‌గా  చీఫ్ స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది.

Exit mobile version