39.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

బాలీవుడ్ ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌ ​ఇంట్లో విషాదం

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన​ నటి మాధురి దీక్షిత్‌ ​ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్​ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఈ విషయాని మాధురి దీక్షిత్​ దంపతులు వెల్లడించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాధురి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు.పలువురు మాధురి కుటుంబ సభ్యులు ఆమె ఇంటివద్దకు చేరుకొని నివారలులర్పిస్తున్నారు. స్నేహలత అంత్యక్రియలను ముంబయిలోని వోర్లీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

తల్లి మరణంతో మాధురి తీవ్ర భావోద్వేగానికి లోనై.. ‘ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తూనే స్వర్గానికి పయనమయ్యారు’ అంటూ బాధను వెల్లడించారు. గత ఏడాది తన తల్లి బర్త్​డే సందర్భంగా ఆమెకు విషెస్​ చెబుతూ.. మాధురి దీక్షిత్ సామాజిక మాధ్యమాల్లో ఓ ఎమెషనల్​ పోస్ట్​ షేర్​ చేశారు . ‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. కూతురికి అమ్మే మంచి ఫ్రెండ్ అని అంటుంటారు.. అది నిజమే కదా? మీరు నా కోసం చేసినవన్నీ, నాకు నేర్పిన విషయాలన్నీ కూడా నాకు బహుమతులే’ అంటూ రాసుకొచ్చారు.

Latest Articles

కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కుమార్తె కావ్య

   లోక్‌సభ ఎన్నికల ముందు.. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారుతున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్