30.7 C
Hyderabad
Friday, June 9, 2023

‘బలగం’ మూవీ చూసి కంటతడి పెట్టుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో విడుదలైన బలగం మూవీని.. మంత్రులు గంగుల కమలాకర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు శుక్రవారం బలగం సినిమా చూశారు. వారి కోసం సినిమా యూనిట్ ప్రత్యేకంగా షో వేసి చూపించింది. అనంతరం కరీంనగర్‌లో విజయోత్సవ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. బలగం సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. బలగం తమను కన్నీళ్లు పెట్టించిందని కొనియాడారు.

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చిన బలగం మూవీ మంచి హిట్ టాక్ ను స్వంతం చేసుకుంది. ఈ సినిమా నిర్మాతకు డబ్బులతో పాటు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇంటిల్లిపాది కలిసి బలగం మూవీని వీక్షిస్తున్నారు. సిరిసిల్ల కు చెందిన కమెడియన్ వేణు.. ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇది మొదటి సినిమానే అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అద్భుతంగా తెరకెక్కించాడు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించాడు.

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్