34.2 C
Hyderabad
Monday, May 29, 2023

గురూజీ పై బండ్ల వ్యంగ్యాస్త్రాలు.. మరి గురూజీ స్పందిస్తారా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: బండ్ల గణేష్.. మైక్ పట్టినా, ట్వీట్ చేసిన హాట్ టాపిక్‌గా నిలువక మానదు. అదే స్టైల్‌లో ఆసక్తికరమైన ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్‌ని దేవుడిగా పూజించే అతను గత కొద్దీ కాలంగా దూరంగా ఉంటున్నారు. దానికి కారణం గురూజీ అని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నా.. అది నిజమని చెప్పకనే చెప్పాడు బండ్ల గణేష్. లేటెస్ట్‌గా ఈరోజు ఉదయాన్నే ప్రొడ్యూసర్‌గా ఎలా మారాలి అని ఒకరు అడిగితే ‘మీట్ గురూజీ.. గివ్ కాస్ట్ లీ గిఫ్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. మరో ట్వీట్ చేసాడు.. భార్యాభర్తల్ని.. గురు శిష్యులను.. తండ్రి కొడుకులను.. ఎవరినైనా వేరు చేస్తాడు అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ రాసుకొచ్చాడు.

ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన గురూజీ కామెంట్స్‌పై ట్విట్టర్‌లో ఒక రేంజ్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అతను టార్గెట్ చేసింది త్రివిక్రమ్ అని అందరికీ తెలుసు కానీ, అసలు గురూజీ మీద బండ్ల గణేష్‌కి ఎందుకు అంత కోపమో ఎవరికీ అర్ధం కావట్లేదు.

ట్విట్టర్‌లో గురూజీ అంటూ ప్రతిసారి త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ చేస్తున్న హంగామా తెలిసిందే. పవన్‌కి తనను దూరం చేసిన త్రివిక్రమ్ మీద ఇలా తన ట్వీట్స్‌తో పగ తీర్చుకుంటున్నట్టు అనిపిస్తున్నా ఇంతగా బండ్ల గణేష్ టార్గెట్ చేసేలా త్రివిక్రమ్ ఏం చేశాడు అన్న డౌట్ కూడా రాకమానదు. అంతేకాదు బండ్ల గణేష్ గురూజీ అని చెబుతూ పెట్టే ట్వీట్స్ నిజంగానే త్రివిక్రమ్‌ను ఉద్దేశించా లేక మరెవరైనా ఉన్నారా అన్న డౌట్ కూడా వస్తుంది.

బండ్ల గణేష్ ఈ రేంజ్‌లో తనపై పంచులు వేస్తున్నా సదరు గురూజీ మాత్రం ఎప్పుడు ఎక్కడ బండ్ల గణేష్ గురించి మాట్లాడింది లేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్‌కి న్యూట్రల్‌గా రెస్పాండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అయిన బండ్ల గణేష్ అభిమాన హీరోకి ఎప్పుడు చెడు చేయడు అనే నమ్మకంతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అందుకే బండ్ల గణేష్ గురూజీ అంటూ విరుచుకుపడుతున్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అంటీ అంటనట్టు మ్యాటర్‌ని లైట్ తీసుకుంటున్నారు.

Latest Articles

కర్ణాటకలో మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రభుత్వం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖతో పాటు కేబినెట్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్