Site icon Swatantra Tv

ఆ జిల్లాలో తీరని వ్యథలు

  ఏపీలోని జిల్లాల్లో కర్నూల్ జిల్లా రూటే సపరేట్. అన్ని జిల్లాల్లో ఎన్నికల తీరు ఒక తీరు. ఈ జిల్లా తీరు మరోతీరు. అందుకే ఈ జిల్లాపై ప్రధాన పార్టీలు గురిపెట్టగా, అసలు జిల్లా పార్టీల స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం.

  52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో కీలకమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఓ వైపు కరువు కాట కం, మరోవైపు ఫ్యాక్షన్ భూతం. రాయలసీమ ముఖద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువు విలయతాండవం చేస్తుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో తాగు, సాగు నీటి కష్టాలు తీరినా అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ప్రజలకు నేటికీ తప్పడం లేదు. ఇలాంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా, ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులను చేసిన ప్రాంతం కర్నూలు జిల్లా చరిత్రలో నిలిచిపోయింది.

  టీడ్కో ఇళ్ల సముదాయం, 10వేల ఇళ్ల నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. అయితే పేద, మధ్యతరగతి ప్రజలకు టిడ్కో ఇళ్ల పేరిట ఐదేళ్ల నుంచి ఉరిస్తూ వచ్చారు. శివార్లలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో ఇళ్ల సముదాయంలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్దిదారులకు ఇళ్లలో చేరలేకపోతున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా 4వేల 500 లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. ఇంతవరకు లబ్దిదారులు చేరేందుకు చొరవచూపటం లేదు. 400 ఎకరాల విస్తీర్ణంలో 665 కోట్ల వ్యయంతో 10వేల ఇళ్లు నిర్మించారు. ఐతే 500 కోట్ల విలువైన పనులు మాత్రం పూర్తి చేశారు. నేటికి 155 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

  రాష్ట్ర విభజన సమయంలో కర్నూలులో కాన్సర్ ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించారు. విభజన తరువాత అధికారాన్ని చేపట్టిన గత టీడీపీ హాయాంలో 120 కోట్ల వ్యయంతో క్యాన్సర్ సెంటర్ పనులు ప్రారంభించారు. ఆ తరువాత రెండే ళ్లుగా కరోనా ప్రభావం చూపటంతో నిర్మాణాలు మందగించాయి. 120 కోట్ల అంచనా మొత్తంలో సివిల్ వర్స్స్‌ పనుల విలువ 30 కోట్లు, మిగిలిన 80 కోట్ల రూపాయలతో యంత్రపరికరాలు కొనుగోలు చేయాలి..వీటిలో భవనాలే 30 కోట్లకు పైగా ఉంటుంది. స్టేట్ క్యాన్సర్ సెంటర్ పూర్తిగా నిర్మించకుండానే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత నెలలో ప్రారంభించారు. ఎక్కడైనా మంత్రులు ప్రారంభించారంటే అవి ప్రజలకు ఉపయోగపడాలి. ఇక్కడ మాత్రం 80 కోట్ల విలువైన యంత్రపరికరాలు లేకుండా, భవనం కూడా పూర్తికాకుండానే ప్రారంభోత్సవం చేశారు.

 కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని సీమజిల్లాల ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల శిథిలావ్యవస్థకు చేరుకుంది. ఈ ప్రయోగశాలలో ఫుడ్ పాయిజన్, నీటిలో ఫ్లోరైడ్ శాతం నిగ్గుతేల్చే పరీక్షలు, ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు నామ మాత్రపు రుసుముతో వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించేవారు. 2009 లో వచ్చిన వరదలతో ఈ భవనం నీటమునిగి పోయింది. ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. టీడీపీ హాయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కె.వి.ఆర్ కాలేజ్, సిల్వర్ జూబ్లీ కాలేజీ ప్రాంగణంలో మౌలిక వసతుల పేరిట 55 కోట్ల రూపాయలతో భవనా లను చేపట్టారు. గత ప్రభుత్వ హాయాంలో మూడు కాలేజీలలో చేపట్టిన నిర్మాణాలు 70 శాతం పూర్తి కాగా, ప్రస్తుత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో 30శాతం పనులు కూడా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాలేక పోయారు. 55 కోట్ల వ్యయంలో కాంట్రాక్టర్‌కు 7 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల మూడేళ్ల నుంచి భవనాలు నిరుపయోగంగా మారాయి.

 క్లస్టర్ యూనివర్శిటీ భవన నిర్మాణ వ్యయం అంతకతంకు పెరిగిపోతుంది. వైసీపీ మానసపుత్రికగా చెప్పుకుంటున్న క్లస్టర్ యూనివర్సిటీ భవన నిర్మాణం పనులు జగన్నాథ గట్టు వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 88 కోట్ల నుంచి 139 కోట్లకు పెంచుతూప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాక్ష్యాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పలు సందర్భాల్లో క్లస్టర్ యూనివర్సిటీ ప్రస్తావించటం మినహా, భవనాలు నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు చొరవ చూపలేకపోతున్నారు. కాంట్రాక్టర్ బంధువులు కావటంతో నిబంధనలకు విరుద్దంగా బిల్లులు డ్రా చేసుకొంటున్నా రని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం బయటపడితే రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారే అవకాశాలు న్నట్లు కనిపిస్తున్నాయి. కర్నూలులో కొన్ని రహదార్లు విస్తరించకోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. ప్రధానంగా… పాతబస్తీ హస్పిటల్ నుంచి సి. క్యాంప్ వరకు, బిర్లా గేట్ నుంచి క్రిష్ణానగర్ మీదుగా హైవే వరకు, నంద్యాల చెక్ పోస్టు పరిధిలో దిన్నెదేవరపాడు నుంచి నంద్యాల ప్రధాన రహాదారి వరకు రోడ్డు మధ్యలో నిలిచిపో యింది. కార్పొరేషన్‌లో గుంతలు పూడ్చలేని పాలకమండలి కార్పొరేటర్లు, మేయర్ రోడ్ల విస్తరణ చేపట్టలేకపోతున్నారు.

  జిల్లాలోని ప్రభుత్వ క్వార్టర్సు కబ్జా, విలువైన స్టలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఎ.బి.సి. పారెస్ట్, ఫిషరీష్ కాపౌండ్ 1200 ఎకరాల విస్తీరణంలో వివిధ రకాలుగా ప్రభుత్వ క్వార్టర్సు నిర్మించారు. వీటిలో ఉద్యోగులు ఉండాల్సిన ప్రభుత్వ క్వార్టర్స్‌లో ప్రస్తుతం ఇతరులు తిష్టవేస్తున్నారు. బి.క్యాంప్‌లో ఖాళీ అయిన క్వార్టర్సులో చేరాలంటే వైసీపీకి చెందిన ఓ మహిళ నేతకు డబ్బులు ముట్టజెప్పితే క్వార్టర్సు అప్పగిస్తోంది. ఇలా అనర్హులు తిష్ట వేయటంతో ప్రభుత్వానికి ఇంటిపన్ను, వాటర్ ట్యాక్స్, పేరిట కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అయితే సుమారుగా 1000 కుటుంబాలు ప్రభుత్వ క్వార్టర్సులో ఉచితంగా ఉంటూ అన్ని సౌకర్యాలు పోందుతున్నారు. వీరివల్ల ప్రభుత్వ ఖజానాకు అదాయం రూపంలో కోట్ల రూపాయల గండి పడుతుంది.నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు.. అర్టీసీ సిటి బస్సుల లేకపోవటంతో ప్రజలపై అర్ధిక భారం పడుతుంది. కర్నూలు కార్పొరేషన్ స్టాయిలో ప్రజలు కొన్ని సౌకర్యాలను కొల్పోతున్నారు. ప్రధానంగా సిటి బస్సులు అందుబాటులో లేకపోవటంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. సిటీ బస్సులు లేక ఆటోలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజురోజుకు నగరశివారు కాలనీలు విస్తరిస్తున్నప్పటికీ సిటీ బస్సుల సౌకర్యం మాత్రమే నగర ప్రజలకు అందుబాటులో తీసుకురాలేకపోతున్నారు.

కర్నూలు నగర ప్రజల జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక వైపు కొత్త కాలనీలు పుట్టుకువస్తుండటంతో జనాభా పెరిగిపోతోంది. ప్రధానంగా కర్నూలు నగరంతోపాటు, కల్లూరు కాలనీలు, కోడుమూరు నియోజవర్గ పరిధిలో కొన్ని డివిజన్లు, లక్ష్మీపురం, పెద్దపాడు గ్రామపంచాయితీలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. నగర పరిధిలోని కాలనీల ప్రజల తాగునీటి అవసరాల కోసం మరో సమ్మర్ స్టోరేజి నిర్మాణం ప్రతిపాదన మరుగునపడేశారు. ప్రస్తుతం నిర్మించిన సమ్మర్ స్టేరేజి ట్యాంక్‌ వద్ద 300 నుంచి 500 ఎకరాల విస్తీర్ణంలో భూమి అందుబాటులో ఉంది. ఈ భూమిలో మరో సమ్మర్ స్టోరేజీ నిర్మిస్తే నగర ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించవచ్చు.

కర్నూల్ జిల్లాలో ట్రాఫిక్‌ పేరిట అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. వాహన యజమానులు, లైసెన్స్‌ లేకుండా ప్రయా ణం చేయటం తదితర వాటిపై పోలీసులు పట్టుకుని జరిమానా విధించిన ఎవ్వరూ తప్పుపట్టరు. ఈ పనిచేయకుండా ట్రాఫిక్‌ పోలీసులు నగర పరిధిలో టూవీలర్ పై తిరుగుతూ అడ్డగోలుగా రోడ్లపై వెళుతున్న వాహానాలను ఫొటోలు తీసి ట్రాపిక్ రూల్స్‌ ఉల్లంఘించినందుకు 235 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు మెసెజ్‌ పంపుతున్నారు. పోలీస్ డిపార్టుమెంట్‌కు ప్రభుత్వ నిధులు కేటాయించ కపోవటంతో ప్రజల నుంచి బలవంతంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ చలానాల పేరిట రోజుకు ఒక్కొక్క ట్రాఫిక్ పోలీసుకు కొంత మొత్తాన్ని ఫిక్స్‌ చేసి వసూలు చేయాలని ఆదేశిస్తున్నారని బాధితులు అంటున్నారు.జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో 5 కోట్ల రూపాయలతో చేపట్టిన ఉల్లి గోదాములకు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిపివేశారు. గత టీడీపీ హాయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వ హాయంలో అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తిచేయలేకపోవటంతో కోట్ల రూపాయల నిర్మాణాలు వృధాగా మారాయి.

జిల్లాలోని నగర శివారులో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జగన్నాథ గట్టు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పేరిట 8 వేల ఇళ్ల నిర్మాణా లు చేపట్టారు. ఇక్కడ మౌళిక వసతులు కల్పించటంలో పాలకులు చొరవచూపకపోవటంతో నిర్మించుకున్న ఇళ్లు శిధిలావ్యవస్టకు చేరుకున్నాయి. మరిన్ని కూలిపోతున్నాయి. ప్రస్తుతం ఈ ఇళ్ల పరిస్టితులు చూస్తే లబ్దిదారులు ఇళ్లపై అశలు వదులుకొవాల్సిందేనన్న అభిప్రాయానికి తీసుకువచ్చారు. కర్నూలు మున్పిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా అస్తి పన్ను 15 శాతం పెంచి ప్రజలపై అర్దిక భారం పడేస్తున్నారు. రిజిష్ట్రేషన్ శాఖ నిర్ణయించిన విలువ అధారంగా ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుపై ఏటా 15 శాతం పెంచుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఇంటి పన్ను ఎంత ఉండేది. ప్రస్తుతం ఏటా ఇంటిపన్ను ఎంత పెంచారు? ఇళ్లు, వాణిజ్య సమాయాలు, బహుళ అంతస్తులు, ఖాళీ స్టలాలు, ఇలా అన్నింటికి పన్ను ఏటా అస్తిపన్ను పెంచుతూ నగర యజమానులను ఆర్ధిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా ఆస్తి పన్ను 15 శాతం పెంచి ప్రజలపై ఆర్థిక భారంపన్నుపై ఏటా 15 శాతం పెంచుతున్న అధికారులు.

Exit mobile version