Site icon Swatantra Tv

ఎన్నికలు ముగిసాయి …సంక్షేమం పైనే ఫోకస్ – సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మినిమం 9 మ్యాగ్జిమం 13 సీట్లు గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేశారు. ఎవరి ఓట్లు వారికి పడితే ఎన్నికలు అంచనా వేయొచ్చని అన్నారాయన. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ 20వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి దేశంలో మొత్తం సీట్లు 210 కూడా దాటవన్నారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి పూర్తిగా పాలనపై ఫోకస్ చేస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ధాన్యం కొనుగోలు, రుణమాఫీపై దృష్టి పెడతామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిసి పోయాయన్నారు. ఇప్పటి నుంచి సంక్షేమంపైనే ఫోకస్‌ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు.

పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామన్న రేవంత్‌ రుణమాఫీ, విద్యాశాఖ మీద ఫోకస్ చేస్తామన్నారు. అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం.. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొ రేషన్ ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా రుణాలు మాఫీ చేసుకోవచ్చని తెలిపారు.రైతుల సమస్యలు, గిట్టు బాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నారు. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మరోవైపు.. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని.. వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగుల పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని తెలిపారు.

మరోవైపు దేశంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం కాంగ్రెస్, సగం బీజేపీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీనే ఉండదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పై ఎవరు ఏం విమర్శలు చేసినా పట్టించుకోమన్నారు. తాము 13 సీట్లు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పోటీ బీఆర్ఎస్ అని పార్లమెంట్ ఎన్నికల్లో తమకు బీజేపీ పోటీ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలేనని, బీఆర్ఎస్ అదే చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version