జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే 2 విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగా.. రేపు 3వ దశ పోలింగ్ జరగనుంది. జమ్మూ ప్రాంతంలో 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాలకు.. కశ్మీర్ ప్రాంతంలో 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తుని కూడా సిద్ధం చేశారు. ఇక ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ప్రచారం పర్వం ముగిసినప్పటికీ పోలింగ్‌కు మరికొన్ని గంటలే ఉండటంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను తమవైపుకి తిప్పుకునే వ్యూహంలో బిజీ అయ్యారు పార్టీ నేతలు.