Site icon Swatantra Tv

ఎన్నికల ప్రచారం … హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్

    దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇక ఎన్నికల ప్రచారం షురూ అయింది.. ఎన్నికల ప్రచారం .. వాయువేగంతో సాగాలంటే.. హెలికాప్టర్లు, ప్రైవేటు జెట్ లు అవసరమే. అన్ని రాజకీయ పార్టీలు హెలికాప్టర్లు, ప్రైవేటు విమానాలు కోసం పోటీ పడితే.. డిమాండ్ పెరిగి ఖర్చు భారీగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

     మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారం మొదలైంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రచారం జోరు అందుకుంటుంది. అందుకు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లను వినియోగించుకునేందుకు ఇప్పటికే రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఫలితంగా గతంలో కన్నా 40,50 శాతం డిమాండ్ హెచ్చే అవకాశం ఉంది. ఫిక్స్ డ్ – వింగ్ విమానాలకంటే.. హెలికాప్టర్లకే డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    సాధారణంగా ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు గంటల చొప్పున చార్జీలను వసూలు చేస్తారు. చార్టెడ్ విమానానికి గంటకు అద్దె నాలుగున్నర లక్షల నుంచి 5 లక్షల 25 వేల రూపాయలవరకూ ఉంటుంది. హెలికాప్టర్ కు గంటకు ఒకటిన్నర లక్షల రూపాయల వరకూ చార్జ్ చేస్తారు. దేశంలో రాజకీయ పార్టీల డిమాండ్ కు అవసరమైన మేరకు ప్రైవేటు జెట్ లు, హెలికాప్టర్లు లేవని క్లబ్ వన్ ఎయిర్ సిఈఓ రంజన్ మిశ్రా వెల్లడించారు. అధిక డిమాండ్ నేపథ్యంలో ముందే కొంతమంది విమానాలను ముందే లీజ్ కు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడూ పలువురు లీజ్ కు తీసుకోవచ్చు.

    దేశంలో 2023 డిసెంబరు నాటికి 112 నాన్‌-షెడ్యూల్డ్‌ ఆపరేటర్లు ఉన్నాయి. అంటే ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తుంటాయి. ఈ సంస్థల వద్ద 350 విమానాలు, 175 పైగా హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా.. వీటిలో చాలావరకూ పదిమందికన్నా తక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్లే ఎక్కువ. ఈ రంగంలోనూ దళారుల బెడద తప్పదు. మధ్యవర్తులు ముందుగా కొన్ని గంటల సేవలను బుక్ చేసుకుని తిరిగి వాటిని కస్టమర్లకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు హెలికా ప్టర్ కు గంటకు మూడున్నర లక్షల రూపాయలవరకూ ఖర్చయ్యే అవకాశం ఉంది. అందుకూ రాజకీ యపార్టీలు సిద్ధ పడుతున్నాయి.

    2019-20 ఆర్థిక సంవత్సరం లో తాము విమానాలకు, హెలికాప్టర్ లకు దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు బీజేపీ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రయాణ ఖర్చు కింద 126 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాక ఇతర పార్టీలు ఎన్నికల ప్రచారానికి ప్రైవేటు జెట్ లు, హెలికాప్టర్ల కోసం ఎగబడితే ఈ సారి ఖర్చు కోటీ 20 లక్షల రూపాయలకు పెరగవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో ఎన్నకలకమిషన్ ఖర్చు 20 శాతం ఉండవచ్చు. కానీ మిగతా పార్టీలు చేసే ఖర్చే తీవ్రంగా ఉంటుంది.

Exit mobile version