Site icon Swatantra Tv

కేజ్రీవాల్‌పై ఈడీ సంచలన ఆరోపణలు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవల షుగర్ లెవల్స్‌ పడిపోతున్నాయని.. క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదిం చేందుకు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. దీంతో ఉద్దేశ్యపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నా రని,  షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పొందాలంకునుటున్నారని ఈడీ పేర్కొంది.

Exit mobile version