Site icon Swatantra Tv

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు

    ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీ కోర్టు పొడిగించింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఇంకా విచారించేందుకు మరో ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరగా.. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఏప్రిల్‌ 1వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు.

    కేజ్రీవాల్‌ స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో తన పేరును నలుగురు సాక్షులు మాత్రమే ప్రస్తావిం చారని.. ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలే సరిపోతాయా? అని ఈడీని ఉద్దేశించి ప్రశ్నించారు. దేశం ముందు ఆప్‌ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈడీ విచారణను ఎదు ర్కొనేందుకు తాను సిద్ధమేనని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసురాజకీయ కుట్ర అని.. దీనికి ప్రజలే సమాధానం చెబుతారని సీఎం కేజ్రీవాల్‌ అన్నారు.

Exit mobile version