సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. దీనికి సంబంధిం చిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. సీఎం జగన్ రోడ్ షోలో జరిగిన ఘటనపైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది.
సీఎం జగన్‌పై దాడి ఘటనకు ఈసీ సీరియస్
