జపాన్ లోని హోషు కోస్తా దీవిలో తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.3 గా నమోదయిందని యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం తెలిపింది. తూర్పు కోస్తా దీవి వద్ద దాదాపు 32 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. జపాన్ వాతావరణ కేంద్రం, సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్ అయి తగిన హెచ్చరికలు చేశాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నారు.


