Site icon Swatantra Tv

హైదరాబాద్‌ రోడ్లపైకి మళ్లీ డబుల్ డెక్కర్

హైదరాబాద్: హుస్సేన్‌ సాగర్‌ తీరాన నెక్లెస్ రోడ్డులో.. బుధవారం సాయంత్రం డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేశాయి. ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయిన డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు, హైదరాబాద్ ప్రజల కోరిక మేరకు మళ్లీ తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జెండా ఊపి బస్సులను ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్‌ ఓవైసీ, హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ, టూరిజం విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గతంలో డబుల్ డెక్కర్ బస్సులు డీజిల్‌తో నడవగా, ఇప్పుడు వచ్చిన కొత్త బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ పవరుతో నడుస్తాయి . ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర 2 కోట్ల 16 లక్షలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్లు.. మళ్లీ సందడి చేస్తుండడంతో.. భాగ్యనగర వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.

Exit mobile version