Site icon Swatantra Tv

మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా..? బండారుపై ఎంపీ నవనీత్ కౌర్ ఫైర్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తోంది మహిళా లోకం. ఈ క్రమంలో మాజీ నటికి మద్దతుగా పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ మాజీ సినీ నటి నవనీత్ కౌర్  సైతం రోజాకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బండారు పై ఆమె ఆగ్రహం వెళ్లగక్కారు.

బండారు సత్యనారాయణకు  అసలు సిగ్గు ఉందా..? మంత్రి రోజాపై ఎంత దిగజారి మాట్లాడతావా..? మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా..? తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ, ఈ బండారు మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారు. మీకు రాజకీయాలు ముఖ్యమా..? లేకుంటే మహిళల గౌరవం ముఖ్యమా..? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అని నవనీత్ కౌర్ ఫైర్ అయ్యారు.ఒక ఎంపీగా, నటిగా, మహిళగా నేను ఏపీ మంత్రి రోజాకు అండగా ఉంటా. నేనే కాదు యావత్ మహిళలంతా రోజాకు అండగా ఉంటుందని నవనీత్ కౌర్ పేర్కొన్నారు. రోజా సినీ పరిశ్రమకు సేవలందించారు. స్టార్ హీరోల సరసన నటించారు. ఆమెకు ఇంతలా కించపరచడం సరికాదు. రాజకీయాల్లో ఇంతలా దిగజారి మాట్లాడటం మంచిది కాదని నవనీత్ కౌర్ హితవు పలికారు. ఇప్పటికే సీనియర్ నటులు కుష్బూ సుందర్, రాధిక శరత్ కుమార్ రోజాకు మద్దతు ప్రకటించగా ఇప్పుడు నవనీత్ కౌర్ రాణా సైతం మద్దతుగా నిలిచారు.

Exit mobile version