Site icon Swatantra Tv

ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం హెచ్చుతగ్గులు లేకుండా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు భారీ నష్టాలతో మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్‌ 62,738.35 దగ్గర ఫ్లాట్‌గా ప్రారంభమైంది. చివరకు 5.41 పాయింట్ల స్వల్ప లాభంతో 62,792.88 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,600.80 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,622.75- 18,531.60 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 5.15 పాయింట్లు మాత్రమే లాభపడి 18,599.00 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు పతనమై 82.68 వద్ద ఉంది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలో బాటలో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

Exit mobile version