Site icon Swatantra Tv

హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం

హైదరాబాద్ నగర పరిధిలో డీజేలపై నిషేధం విధించారు. ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ను నిషేధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజే సౌండ్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్‌ 100కు ఫిర్యాదులు పెరగడంతో నగర పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సౌండ్ సిస్టంకు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. అలాగే, మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా నిషేధమని సీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధిస్తామని చెప్పారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ హెచ్చారించారు.

Exit mobile version