Site icon Swatantra Tv

TSPSC: రేవంత్‌పై కేసు పెడతారా? కారణం అదేనా..

Revanth Reddy (File Photo)

TSPSC: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పీఎస్సీ) పరీక్షల పేపర్‌ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) విచారిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డితో పాటు.. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు బండి సంజయ్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే రేవంత్‌ రెడ్డి గురువారం సిట్‌ అధికారుల విచారణకు హాజరయ్యారు. తాజాగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో మరో మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. విచారణ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చారని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిట్‌ విచారణకు హాజరైన రేవంత్‌ తప్పుడు సమాచారం ఇచ్చారని భావిస్తోంది సిట్‌. ఆయన విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారంటున్నారు పోలీసులు. రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదు విషయంలో సిట్ అధికారులు న్యాయసలహా కోరినట్లు సమాచారం. పేపర్‌ లీక్‌పై రేవంత్‌రెడ్డి తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్‌ తెలిపింది. నిరాధార ఆరోపణలు చేశారన్న కోణంతో ఆయనపై చర్యలకు సిద్దమవుతున్నారు అధికారులు. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌లో ఒకే మండలంలో 100 మందికి 100 మార్కులు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్‌ రెడ్డి. దీనిపై ఆధారాలు చూపించాలని సిట్‌ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు విచారణకు హాజరైన రేవంత్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేపర్‌లీక్‌పై సిట్‌ విచారణకు హాజరయ్యారు రేవంత్‌రెడ్డి. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌కు ఇచ్చినట్టు తెలిపారు. పేపర్‌ లీక్‌పై మాట్లాడిన మంత్రి కేటీఆర్‌కు కూడా సిట్‌ నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

Exit mobile version