Site icon Swatantra Tv

తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ నేతల ధర్నా

పోడు భూములు సాగుచేస్తున్న ఆదివాసీ రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఉట్నూర్ ITDA ముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు ధర్నా చేపట్టారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఏజెన్సీలో మెగా స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. జీఓ నెంబర్ 3ను యధావిధంగా కొనసాగించాలని ఆదివాసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీ నాయకుల డిమాండ్లపై ITDA PO కుష్బూ గుప్తా స్పందించారు. ఆదివాసీలకు తగిన విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసం అని, ఎప్పుడైనా వచ్చి సమస్యలు చెప్పవచ్చని తెలిపారు.

Exit mobile version